ETV Bharat / state

గుత్తేదారుల అక్రమాలు.. నష్టపోతున్న మత్స్యకారులు - తెలంగాణ తాజా వార్తలు

చేప చేప ఎందుకు పెరగడం లేదు... అని అడుగగా... చిన్ననాటి నుంచి నా ఎదుగుదలకు ఎవరూ.. కృషి చేయలేదని ఆ చేప ఇంకో చేపకు చెప్పిందట. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఏటా ఇచ్చే సీడ్ లోపం వల్ల... చేప పిల్లలు ఎదగ పోవడంతో మత్స్యకారులకు నష్టం తప్పడం లేదు. కాసులకు కక్కుర్తి పడుతున్న గుత్తేదారులు నాసి రకం సీడ్ చేప పిల్లలు వదలడం వల్ల చెరువుల్లో వదిలిన చేప పిల్లలు... 10 నెలలు దాటినా చేపల్లో ఎదుగుదల లేక తాము నష్టాల బారిన పడుతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు.

contractors monopoly fishermen lost in gadwal district
గుత్తేదారుల అక్రమాలు.. నష్టపోతున్న మత్స్యకారులు
author img

By

Published : Jun 6, 2021, 6:57 PM IST

ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తున్నా… పలువురు గుత్తేదారుల అక్రమ లాభర్జన ధ్యేయం మూలంగా.. తాము తీవ్ర నష్టాలకు గురవుతున్నామని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లాలో ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1.21 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది. అధికారులు జిల్లాలో ఉన్న 137 చెరువులు, ఆరు రిజర్వాయర్లు, రెండు ప్రాజెక్టులు, ఒక బ్యాక్ వాటర్ ప్రాంతాలను గుర్తించి… 1.15 లక్షల చేప పిల్లలను వదులుతున్నారు. గుత్తేదారులు నిబంధనలు పాటించకుండా 500 గ్రాముల లోపు చేపల నుంచి గుడ్లను సేకరించి… చేప పిల్లలను తయారు చేయడం వల్ల ఎదుగుదల రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆ కారణంగా 10 నెలలు దాటినా చేప పిల్లల్లో ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు.

అధికారులు, గుత్తే దారులు ఇచ్చే మామాళ్లకు అలవాటు పడి… సీడ్ సరైనదా లేదా అని నిర్ధరణ చేయకుండానే చెరువుల్లో విడుదల చేయిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల తమకు లాభాలు వస్తాయని, తాము గట్టెక్కుతామని మత్స్యకారులు సంబురపడ్డారు. ఈ క్రమంలో చెరువుల నుంచి చేపలను తీయడం ప్రారంభించారు.

ఒక్కో చెరువులో కనీసం 40 టన్నుల నుంచి 50 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని మత్స్యకారులు అనుకున్నారు. అందుకు చేపల వాపారస్తులతో ఒప్పందం సైతం చేసుకున్నారు. తీరా వలల ద్వారా చేపలు బయటకు తీస్తే… ఒక్కో చేప 250 నుంచి 400 గ్రాములకు మించి ఎదగలేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. చేప పిల్లలను చెరువుల్లో వదిలిన 10 నెలల్లోపు ఒక్కో చేప కనీసం కేజీకీపైగా ఎదుగుదల లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమార్జనకు అలవాటు పడ్డ గుత్తేదారులు, అధికారులకు మామూలు ముట్టజెప్పి నాసిరకం చేప పిల్లలను వదలడం వల్లే చేపల్లో ఎదుగుదల లేదని మత్స్యకారులు మండి పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలు ఎదుగుదల లేక నష్ట పోతున్నామని అంటున్నారు. చేప పిల్లలను వదిలినప్పుడు నాసిరకంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా… టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు సరఫరా చేశారని తామేమీ చేయలేమని అన్నారని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచి సీడ్ మత్స్యకారులకు ఇస్తే అభివృద్ధిలోకి వస్తామని వారు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: Putta madhu: కవిత, సంతోష్​పై ఈటల వ్యాఖ్యలను ఖండించిన పుట్ట మధు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.