జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మిడతలను పర్యవేక్షణకు కమిటీలను వేశామని జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. మిడతలను నివారించేందుకు ద్రావణాలను సిద్ధంగా ఉంచామన్నారు.
2 వందల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ద్రావణం చల్లే విధంగా సెస్నోఫ్లైట్ డ్రోన్‌లను బెంగుళూరు నుంచి తీసుకొచ్చే అనుమతి కోరినట్లు చెప్పారు. మిడుతల దండు రాకకు సంబంధించి అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. జిల్లా సరిహద్దు గ్రామాలను అప్రమత్తం చేశామని వివరించారు.
ఇదీ చూడండి : పేగు బంధాన్ని తెంచేసిన కరోనా మహమ్మారి