జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఒకటవ గనిలోని మైసమ్మ ఆలయంలో ఆర్టీసీ కార్మికుల ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని వేడుకున్నారు. ఆలయంలో మైసమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: '18 బిలియన్ డాలర్లకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యం'