జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సింగరేణి ప్రారంభించనున్న కాకతీయఖని ఓపెన్ కాస్ట్-3 ప్రాజెక్ట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఘనపూర్ మండలం కొండాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోయే చుట్టుపక్కల గ్రామాల రైతుల ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కొండాపూర్, కొండంపల్లి, మాధారవు పల్లెతో పాటు చుట్టూ ఉన్న గ్రామ రైతుల భూములు ఈ ప్రాజెక్టు కిందకు రానున్నాయి.
ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరయ్యారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా... ప్రతి కుటుంబంలో ఒక్కరికి సింగరేణి ఉద్యోగం ఇప్పించి, భూమికి సంబంధించిన డబ్బును ఒకే దఫాలో ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎవరికి నష్టం జరగకుండా చూసుకొని... రైతులకు అన్ని ఏర్పాట్లు కల్పించిన తర్వాతే సింగరేణి పనులు ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు. వేదికపై మాట్లాడేందుకు అవకాశం రాని రైతులు కొంత అసహనానికి గుర్యయారు. వారిని పోలీసులు అదుపు చేస్తుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి: వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!