లాండ్రీ, సెలూన్ షాపులు, దోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడం పట్ల రజక సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రజకుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ లోన్లలో తమకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. హైదరాబాద్‌లో రజక భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు