జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్రాజెక్టు మొదటి దశలో సాంకేతిక కారణాలతో 500 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు కేటీపీపీ వర్గాలు తెలిపాయి.
కేటీపీపీలోని ఓ బాయిలర్ ట్యూబు లీకేజీతో మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆగిందని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'గగన్యాన్ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'