వన దేవతల ఆగమనం లేకపోయినా సమ్మక్క, సారలమ్మ ఆలయాల చెంత శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి పూట జాగారాలు చేస్తూ... నాలుగు రోజులు వైభవంగా నిర్వహిస్తారు. గత రెండేళ్ల నుంచి చిన్న జాతరకొచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ ఏడాది మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా. సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆది, బుధవారాల్లో హన్మకొండ నుంచి అదనపు బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.