జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని తహసీల్దారు కార్యాలయం ముందు ఓ వృద్ధుడు కుటుంబంతో సహా ఆందోళనకు దిగాడు. భాగీర్తి పేటకు చెందిన వీరమల్ల వెంకట్రాజం (75) తన నాలుగెకరాల భూమి భూరికార్డుల ప్రక్షాళనలో నమోదు కాలేదు. తిరిగి వాటిని రికార్డుల్లో ఎక్కించాలంటూ రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగాడు. అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాడు.
కదల్లేని పరిస్థితి చూసైనా కనికరించడం లేదు
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా పనికాలేదని వాపోతున్నాడు. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ తన కూతుర్ల సహాయంతో రేగొండ ఎమ్మార్వో కార్యాలయం ముందు పడుకొనినిరసన తెలిపాడు. ఎట్టకేలకు వారి భూమికి సంబంధించి ఎంక్వైరీ చేసి రెండురోజుల్లో పట్టా మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.మరో వారంరోజులు వేచి చూస్తామని అధికారులు మాట తప్పితే మళ్లీ తండ్రితో సహా ఆందోళన చేస్తామంటున్నారు కుటుంబ సభ్యులు.
ఇవీ చదవండి:102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం