జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లాలో సమర్థంగా నిర్వహించినందుకుగానూ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు అవార్డు దక్కింది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా ఎన్ఐఆర్- యునీసెఫ్ అవార్డు పొందారు.
ప్రజారోగ్యంలో ప్రముఖ పాత్ర పోషించే శుద్ధమైన త్రాగునీరు కల్పన,పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు బహిరంగ మలమూత్ర విసర్జన జిల్లాగా తయారు చేసేందుకు కలెక్టర్ చేపట్టిన చర్యలను యునెస్కో గుర్తించింది. జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ వారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తాగునీరు, పారిశుద్ధ్యం,వ్యక్తిగత పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డులను అందించారు.
యునెస్కో వారిచే గుర్తించబడి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా వాష్ అవార్డు పొందడం ఆనందంగా ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత సమర్థంగా అందించే బాధ్యత మరింత పెరిగిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మరింత ప్రగతి సాధించేందుకు కృషిచేస్తానన్నారు వెంకటేశ్వర్లు.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!