ETV Bharat / state

అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించిన జిల్లా కలెక్టర్​ - jayashankar bhupalpally district news

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ మహ్మద్​ అబ్దుల్​ అజీం అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు పనులను వేగంగా నిర్వహించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.

collector teleconference with officers
collector teleconference with officers
author img

By

Published : May 19, 2020, 5:26 PM IST

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులను వేగంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా పలువురు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల ప్రగతిపై సమీక్షించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని కలెక్టర్​ అన్నారు. ప్రభుత్వం జిల్లాకు ఉపాధిహామీ కల్పన కొరకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం పేద ప్రజలకు పని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఉపాధి హామీ పనులు నిర్దేశిత లక్ష్యం ప్రకారం నడిచేలా ప్రతి మండలానికి ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నానని వెల్లడించారు. ఆయా మండలాల్లో వాటర్ షెడ్​లు, చెరువుల పూడిక, కుంటలు, మట్టి కట్టల నిర్మాణం తదితర పనులను చేపట్టాలని కలెక్టర్​ అధికారులకు తెలిపారు. ఉపాధి లేకుండా ఇబ్బందిపడుతున్న నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి వేతనం పొంది గౌరవంగా జీవించేలా చూడాలని అన్నారు. సీఎం కేీసీఆర్​ ఆదేశాల మేరకు చెరువులలో పూడిక మట్టిని రైతులు వారి పొలాలకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలు అధిక మొత్తంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేలా చూడాలని అధికారులకు జిల్లా పాలనాధికారి సూచించారు.

ఇవీ చూడండి: సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.