జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో జోరుగా ఓటింగ్ కొనసాగుతోంది. భూపాలపల్లి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించగా... రేగొండ, చిట్యాల పోలింగ్ కేంద్రాల్ని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి రవి కిరణ్ పరిశీలించారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 21.75 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలోని మొత్తం 18 పోలింగ్ కేంద్రాల్లో 12,976 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టభద్రులు ఓటేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను పోలీసులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్‌గా మారి