కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి పునరావాసం, పరిహారం వివరాలు కేంద్రానికి ఇవ్వలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. గిరిజన మంత్రిత్వశాఖ అనుమతులు కూడా కేంద్రానికి సమర్పించలేదని చెప్పారు. రాజ్యసభలో తెరాస సభ్యుడు లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు పెట్టుబడుల అనుమతుల ప్రతిపాదనను ఆగస్టు 2018లో కేంద్రానికి ఇచ్చారని చెప్పారు.
పీఎంకేఎస్వై, ఏఐబీపీ పథకంలో చేర్చడం, ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి అన్ని రకాల అనుమతలతో పాటు పథకం మార్గదర్శకాలు, నిధుల లభ్యత, ప్రాజెక్టు పరిధి వంటివి పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, నిర్వహణ రాష్ట్రాలు తమతమ ప్రాధాన్యాల మేరకు చేపడతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల 190 కోట్లకు కేంద్ర జలశక్తి శాఖ సలహా కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి రతన్ లాల్ కటారియా వెల్లడించారు. అయితే పునరావాసం, పరిహారం వివరాలు మాత్రం ఇవ్వలేదని తెలిపారు.
ఇదీ చూడండి: అమరావతి పరిరక్షణ 5 కోట్ల ప్రజల బాధ్యత: చంద్రబాబు