జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండల మండలం తిరుమలగిరిలో ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ సంరక్షణ ముఖ్యాధికారి అక్బర్, పీసీసీఎఫ్ ప్రశాంత్ పర్యటించారు. గ్రామ శివారులోని చారిత్రక ప్రాంతం పాండవులగుట్టను సందర్శించారు. ఆదివారాల్లో రాక్ క్లైమ్బింగ్, రాపెల్లింగ్, ట్రెక్కింగ్‌ను పరిశీలించారు.
పాండవులగుట్ట ఆహ్లాదకరంగా, అద్భుతంగా ఉందని సీసీఎఫ్ అక్బర్ అన్నారు. గుట్ట వెనకాల ఉన్న చెరువును అభివృద్ధి చేసి పర్యటకులను ఆకర్షించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ వజ్రా రెడ్డి, చెల్పూర్ ఎఫ్ఆర్ఓ నాగరాజు, ఎఫ్ఎస్ఓ ప్రసాద్ రావు, ఎఫ్బీఓ మహమ్మద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్లు భాస్కర్, శ్రీకాంత్, భరత్ రాజ్, రవీందర్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : అటవీ ప్రాంతంలో లైసెన్స్ తుపాకులతో వేట