జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకున్నారు.
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తుల పూనకాలతో గోదావరి తీరం సందడిగా మారింది. అనంతరం భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.