జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పర్యటించారు. హరితహారంలో భాగంగా రేగొండ మండల కేంద్రం నుంచి చెల్పూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చేస్తున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. హరితహారంలో భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఆకర్షణీయమైన మొక్కలను పెంచి.. రహదారిని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
గ్రామాల్లో ఉన్న చెరువు కట్టలపై మొక్కలను పెంచాలన్నారు. ప్రతి గ్రామంలో ఒక ఎకరం స్థలంలో పార్క్ ఏర్పాటు చేసి దానిలో నీడనిచ్చే మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలను నాటాలని సూచించారు. ప్రధాన రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే ఇతర రోడ్లకు, ప్రధాన రహదారి నుంచి రెండు కిలో మీటర్ల దూరం వరకు అందమైన పూల మొక్కలు నాటి సుందరీకరణ చేయాలన్నారు.
వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ల వద్ద హరితహారంలో మొక్కలు నాటి పచ్చదనం వెల్లివిరిసేలా రూపొందించాలన్నారు. పర్యటకులను ఆకర్షించేలా రేగొండ మండలంలోని పాండవులగుట్టను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. హైదరాబాద్కు చెందిన కన్సల్టెంట్ అభిజిత్ వద్ద సాంకేతిక సహకారం తీసుకొని ఈ పనులన్నింటిని చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు...