approach road Broken: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. వరద ఉద్ధృతికి కాళేశ్వరం వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. ఫలితంగా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు.. మరమ్మతు చర్యలు ప్రారంభించారు. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో చర్యలకు ఆటంకం కలుగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. 1986లో 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవ్వగా.. ప్రస్తుతం 28 లక్షల 67వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఫలితంగా మేడిగడ్డ పంప్ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో మేడిగడ్డ 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు కాగా.. ఉన్న 66 గేట్లను తెరిచి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి..
కాళేశ్వరానికి రికార్డు స్థాయిలో వరద.. మేడిగడ్డ, అన్నారం గేట్లు ఎత్తివేత