జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్లో అదనపు ఎస్పీ… జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసుల్లోని వివరాలన్నింటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.
నేరస్తులకు శిక్షలు పడే విధంగా చేయాలని చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి.. పట్టుబడిన వ్యక్తుల లైసెన్సులను రద్దు చేయించే విధంగా ప్రతి అధికారి కృషి చేయాలని కోరారు. పాత నేరస్థుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు రాజీ పడవద్దని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా