ETV Bharat / state

వాట్సాప్​తో బెదిరింపులు.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు

author img

By

Published : Dec 14, 2019, 3:29 PM IST

వాట్సాప్​తో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 చరవాణీలు, ఒక సిమ్​కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

whats-app-call-threatened-two-persons-were-arrested-by-jangan-police
వాట్సాప్​తో బెదిరింపులు.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు

వాట్సాప్ ద్వారా చంపుతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు సభ్యులను జనగామ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనగామకు చెందిన మోరే భాస్కర్, పసరమడ్లకు చెందిన నిమ్మల ప్రభాకర్ ముఠాగా ఏర్పడి చండ్ర పుల్లారెడ్డి దళం పేరుతో జనగామకు చెందిన తుమ్మ రాజిరెడ్డి, అతని అన్న బాలశౌరి రెడ్డిలను వాట్సాప్​ ద్వారా 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే అతని కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు.
అదే విధంగా వెల్మజలకు చెందిన తన బంధువైన ఆర్ఎంపి డాక్టర్​గా పనిచేస్తున్న గాజులపటి నర్సింగరావుతో అంబర్ పేట బాయ్ పేరుతో చాట్ చేసి 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. డబ్బు ఇవ్వకపోతే అతని కొడుకును యాక్సిడెంట్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని దీనిపై గుండాల పోలీస్ స్టేషన్​లో రాజిరెడ్డి ఫిర్యాదు చేశాడు.
అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 2 చరవాణిలు, 1సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నామని, నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ చేసి.. కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో ఉల్లికి భద్రత కరువాయె!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.