జనగామలో ఆర్టీసీ కార్మికులు స్థానిక దీక్ష శిబిరం నుంచి నెహ్రూ పార్క్ వరకు భిక్షాటన చేశారు. వచ్చిన సొమ్మును కరీంనగర్లో అమరుడైన బాబు కుటుంబానికి అందజేస్తామన్నారు. భిక్షాటనలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.. గత నెల కార్మికుల జీతాలను వెంటనే తమ ఖాతాలో జమ చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు జీతాలు లేక భిక్షం అడుక్కునే స్థితికి రావడానికి కారణం కేసీఆరే అని ఆయన విమర్శించారు.
జనగామలో ఆర్టీసీ కార్మికుల భిక్షాటన - janagama latest news
ఆర్టీసీ సమ్మెలో భాగంగా జనగామలో నేడు కార్మికులు భిక్షాటన చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం 28 రోజులుగా నిరసన చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు వాపోయారు. కరీంనగర్లో అమరుడైన కార్మికుడు బాబు కుటుంబానికి భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్మును అందజేస్తామన్నారు.