యశ్వంతపూర్ వాగులోకి జనగామ మున్సిపాలిటీ మురుగునీటి తరలింపు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ - వరంగల్ రహదారిపై ఆ గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమకు వద్దంటూ నినాదాలు చేశారు.
వాగులోకి జనగామ మురుగు నీరు వస్తే బోరు బావులు, బోర్లు కలుషితమై పంటలు పండించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం నిర్మించడం వల్ల గ్రామానికి జరిగే అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. కలుషిత నీటితో గ్రామస్థులు అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని తెలిపారు. స్వప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నెల్లుట్ల చెరువులోకి వెళ్తున్న నీటిని యశ్వంతపూర్ వాగులోకి తరలించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఫేస్బుక్లో పోస్ట్... ఆ తర్వాత..?