రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని... గ్రామాల్లో ధాన్యపు సిరులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతోనే ఆరు సంవత్సరాల్లోనే వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఎనలేని అభివృద్ధిని సాధించిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు సరఫరా, ప్రతి చెరువును నింపడం వల్ల ఈ వృద్ది సాధ్యమైందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్.. ఇదో వంచనా శిల్పం