ETV Bharat / state

జనగామలో మరో కరోనా కేసు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం వల్ల ప్రశాంతంగా ఉన్న జనగామ జిల్లా తాజాగా నమోదైన ఒక పాజిటివ్ ​కేసుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తతో వైరస్​ బాధితున్ని గాంధీకి తరలించారు.

one more corona case registered in janagama
జనగామలో మరో కరోనా కేసు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం
author img

By

Published : Apr 24, 2020, 11:42 AM IST

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. మొదట్లో మర్కజ్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల అప్రమత్తమైన అధికారులు గాంధీకి తరలించి చికిత్స అందించారు. వారు కోలుకున్నారని తెలియడం వల్ల జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా మరో కేసు నమోదు అవ్వడం వల్ల మరోసారి అప్రమత్తమైన అధికారులు.. బాధితుని కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మందిని క్వారంటైన్​కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బాధితుడు పంజాబ్​లోని ఫిరోజ్​పూర్​లో ఆర్మీ జవాన్​గా పని చేస్తున్నాడు. అతడు మార్చి 18న గ్రామానికి రాగా.. ఈ నెల 20న అధికారులు అతని నుంచి నమూనాలు సేకరించారు. కాగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. వెంటనే బాధితుడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్​ వార్డుకి తరలించారు.

ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.