జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లుకు చెందిన వైట్ల రాజమౌళి చాన్నాళ్లుగా జనగామ వీవర్స్ కాలనీలో చేనేత కూలీగా పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. అతడికి భార్య, ఓ కుమారుడితో పాటు వృద్ధురాలైన తల్లి కూడా ఉన్నారు. వీరందరితో కలిసి ఓ గది అదెక్కు తీసుకొని జీవిస్తున్నాడు. వయోభారంతో తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగురోజులుగా వాంతులు, విరేచనాలతో అవస్థపడుతోంది.
ఉన్నది ఒక్కటే గది కావడంతో ఏం చేయాలో తోచలేదు. చివరకు ఇంటి ముందే రోడ్డువారగా రేకులతో కొంత మరుగు ఏర్పాటు చేసి.. మంచం వేసి తల్లిని అక్కడ ఉంచాడు. ఆదివారం ఉదయం ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. వార్డు సభ్యురాలు గుర్రం భూలక్ష్మి, కాలనీవాసులు తలో చేయి వేసి అంత్యక్రియలు జరిపించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు