జనగామ జిల్లా పాలకుర్తి మండలం టీఎస్కే తండాలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బంజారా మహిళలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నృత్యం చేశారు. అంతకుముందు మంత్రికి బంజారా సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికారు.
సంత్ సేవాలాల్ చూపిన మార్గం నేటి సమాజానికి స్పూర్తిదాయకమని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. తండాలను, బంజారాలను గుర్తించిన మహానీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అభివర్ణించారు. భాజపా లాంటి కొన్ని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బంజారాల న్యాయమైన కోర్కెలను తీర్చందుకు కృషిచేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి