ETV Bharat / state

రైతు సంక్షేమానికి కేసీఆర్ కృషి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - జనగాం జిల్లా తాజా వార్తలు

కార్పొరేట్​ శక్తులకు మేలు చేసేలా నూతన వ్యవసాయ చట్టాలను భాజపా తీసుకొచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విమర్శించారు. జనగామ జిల్లాకేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

market yard new committee meeting in jangaon district
'రైతు క్షేమం కోసం కేసీఆర్ కృషి... కార్పొరేట్​ శక్తులకు భాజపా మేలు'
author img

By

Published : Dec 12, 2020, 10:50 AM IST

రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే... కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు.

రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. నూతన వ్యవసాయ చట్టాలని తెరాస ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు అమలు చేస్తుంటే, మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యిందని విమర్శించారు. మార్కెట్ ఛైర్​పర్సన్​గా బాల్దె విజయ సిద్దిలింగం, వైస్ ఛైర్మన్​గా ఐలేని ఆగిరెడ్డితోపాటు ఏడుగురు కార్యవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి: పేకాట కోసం 50 ఎకరాలు అమ్మాడు.. చివరికి దొంగగా మారాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.