ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ఘటన జనగామ జిల్లా హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై యశ్వంతపూర్ క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వరంగల్ రెండో డిపోకు చెందిన బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో జనగామ పట్టణంలోకి వెళ్లేందుకు బైపాస్ రోడ్డు నుంచి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'