ETV Bharat / state

ఎన్నికలు అయిపోయాయి.. ఇక మీ పనిలోనే ఉంటాం: కేటీఆర్​

author img

By

Published : Feb 26, 2020, 3:39 PM IST

పట్టణ ప్రగతిలో భాగంగా జనగామ పట్టణంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు. పట్టణంలో అమలవుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం తదితర అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ktr tour in jangon
జనగామ పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్​

పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి కేటీఆర్​ జనగామలో ఆకస్మికంగా పర్యటించారు. ధర్మకంచ బస్తీలో పర్యటింటిన మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనుల అమలు తీరుపై ఆరా తీశారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై... పట్టణాభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానంగా మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు కేటీఆర్​ పేర్కొన్నారు.

తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలిలని ప్రజలకు సూచించారు. భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను నర్సరీల ద్వారా అందజేస్తామని తెలిపారు. పట్టణాల్లో వాటర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రెండు నెలల్లో జనగామలో ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలని కేటీఆర్​ సూచించారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసాయని, ఇక ప్రజల సమస్యలు, అభివృద్ధి పనుల్లోనే పూర్తి సమయం గడుపుతామని అన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణ యువకుడి సత్తా... 7 పర్వతాలు అధిరోహణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.