ETV Bharat / state

'ఆవిష్కరణలతో జనగామ విద్యార్థుల అసాధారణ ప్రతిభ'

ఇన్‌స్పైర్‌ మనక్‌.. విద్యార్థుల్లో సృజనను వెలికతీసే వేదిక.. వారి ఆలోచనలకు అద్దం పట్టే ఘట్టం.. నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టే సందర్భం.. మెదడుకు పదునుపెట్టి తెలివితేటలను పెంపొందించే కార్యక్రమం.. సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలను రూపొందించే అద్భుత అవకాశం.. ఈ ఏడాది కరోనా నిబంధనలతో నిర్వహించిన జనగామ జిల్లా స్థాయి పోటీలో 46 జట్లు పాల్గొన్నాయని జిల్లా సైన్స్‌ అధికారిణి గౌసియాబేగం తెలిపారు. అందులో 5 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయని చెప్పారు. ఆ ప్రదర్శనలపై 'ఈటీవీ భారత్​' కథనం.

jangaon
'ఆవిష్కరణలతో జనగామ విద్యార్థుల అసాధారణ ప్రతిభ'
author img

By

Published : Dec 24, 2020, 3:12 PM IST

విద్యార్థుల్లో సృజనను వెలికితీసేందుకు రూపొందించిన వినూత్న కార్యక్రమం 'ఇన్​స్పైర్​ మనక్​'. జనగామ జిల్లాలో ఇన్​స్పైర్​ మనక్​.. ఈ ఏడాది నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో 46 జట్లు పాల్గొనగా అందులో 5 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యాయి.

సౌరశక్తితో నీటిని శుద్ధి చేసేందుకు

nandini
సౌర శక్తితో నీటిని శుద్ధి చేసేందుకు

ఎ.నందిని, ఎనిమిదో తరగతి

గీతాంజలి పబ్లిక్‌ స్కూల్‌, జనగామ

మార్గదర్శకులు : ఎం.శ్రీకాంత్‌

వినియోగించిన పరికరాలు : పారదర్శక అద్దం, కార్డుబోర్డు, ప్లాస్టిక్‌ పైపులు, ఒక నల్లా, నీరు.

అయిన ఖర్చు : పరికరాలు అందుబాటులో ఉంటే రూ.100, కొత్తవి కొంటే రూ.400

ఉద్దేశం : సోలార్‌ వాటర్‌ డిస్టిలేటర్‌ పరికరానికి గల ఇన్‌లెట్‌ పైపు ద్వారా మురుగు నీటిని పరికరంలో గల బేసిన్‌లో పోయాలి. పరికరానికిగల పారదర్శక అద్దం సూర్యరశ్మిని గ్రహించి బేసిన్‌లోకి నీరు భాష్పీభవనం చెంది ఏటవాలుగా అద్దానికి చేరుతుంది. ఇలా శుద్ధి అయిన స్వచ్ఛమైన నీటి బిందువులు జారి అవుట్‌లెట్‌ పైపు ద్వారా వచ్చిన శుభ్రమైన నీటిని మనం క్యాన్‌లో భద్రపరచుకోవచ్ఛు.

ఇంటి వద్దే చికిత్స పొందేలా

sireesha
ఇంటి వద్దే చికిత్స పొందేలా

ఎస్‌.శిరీష, పదో తరగతి

సేయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌, రఘునాథపల్లి

మార్గదర్శకులు: మడిపోజు హేమంత్‌

వినియోగించిన పరికరాలు: యూఎస్‌బీ కేబుల్‌, కంప్యూటర్‌, రెండు పారామీటర్లు, పవన్‌ సప్లై కనెక్టర్‌, ఎల్‌ఈడీ, ఆర్డినో యూఎన్‌వో బోర్డు, వ్రిస్ట్‌ ప్యాడ్‌, వ్రిస్ట్‌ బోర్డు

ఉద్దేశం : ఈ పరికరం ముఖ్యోద్దేశం రక్తపోటును, శరీర ఉష్ణోగత్రల హెచ్చుతగ్గుదలను తెలియజేస్తుంది. వ్యాధిగ్రస్థులు చికిత్స పొందిన తరువాత ఈ పరికరం ధరించడంతో ఇంటి వద్దనే శరీర ఉష్ణోగ్రతను, రక్తపోటును తెలుపుతుంది. ఇంటర్‌నెట్‌ను వినియోగించి వైద్యులు చికిత్స పొందిన వ్యక్తి గురించి తెలుసుకునే వీలుంటుంది.

వరికొయ్యలను చిన్నగా కోసేందుకు

theresa
వరికొయ్యలను చిన్నగా కోసేలా

టి.ఫెలిన్‌థెరిసా, తొమ్మిదో తరగతి

సేయింట్‌మేరిస్‌ హైస్కూల్‌, హైదరాబాద్‌ రోడ్డు, జనగామ

మార్గదర్శకులు : ఎస్‌.శంకరాచారి

వినియోగించిన పరికరాలు : ఆక్సా బ్లేడ్లు, నాలుగు ఇంచుల నట్‌బోల్టులు-8, ప్యాన్‌ బేరింగ్స్‌-8, చెక్క, నేల్స్‌

అయిన ఖర్చు: రూ.1500

ఉద్దేశం : వరికోసే యంత్రాలు అడుగు ఎత్తుపై నుంచి వరిని కోయడంతో చాలామంది రైతులు వరికొయ్యలను తగులబెడుతున్నారు. దీంతో దిగుబడి పెంచే బ్యాక్టీరియా చనిపోతుంది. దిగుబడి తగ్గి రైతు నష్టపోతున్నాడు. ఈ పరికరంలో రెండు పిడులు ఉంటాయి. ఒక్కో పిడి నాలుగు నుంచి ఆరు బ్లేడ్లు కలిగి ఉంటాయి. దీన్ని ప్రారంభించగానే వరికొయ్యలు చిన్న ముక్కలుగా చేసి పొలాల్లో వదిలేస్తుంది. వాటిని కలియదున్నడంతో నేల సారవంతంగా మారుతుంది.

బోరుబావిలో పడిన పిల్లలను రక్షించేందుకు

ravali
బోరుబావిలో పడిన పిల్లలను రక్షించేందుకు

ఇ.రవళి, తొమ్మిదో తరగతి

వాణి హైస్కూల్‌, బచ్చన్నపేట

వినియోగించిన పరికరాలు : అంగుళం మంద కలిగిన ఇనుప పైపు, ఇందులో దూరేలా మరో దృఢమైన పైపు, బెలూన్‌, సన్నని మెటల్‌ ప్లేట్స్‌, ఎల్‌ఈడీ బల్బు, సీసీ కెమెరా, ఆక్సిజన్‌, సిలిండర్‌, శంకు ఆకారంలోని ప్లాస్టిక్‌ వస్తువు.

ఉద్దేశం: చాలా ప్రాంతాల్లో బోరుబావి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బోరు బావిలో చిక్కుకున్న పలువురు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ ప్రయోగం ద్వారా తక్కువ సమయంలో వ్యయ ప్రయాసలు లేకుండా పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావచ్ఛు

అంబులెన్స్‌కు ట్రాఫిక్‌ ఇక్కట్లు లేకుండా

rakesh
అంబులెన్స్​కు ట్రాఫిక్​ ఇక్కట్లు లేకుండా

బి.రాకేశ్‌, తొమ్మిదో తరగతి

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కడవెండి

మార్గదర్శకులు : వి.రేణుక

వినియోగించిన పరికరాలు: మాగ్నటిక్‌ ప్రొడక్ట్‌, ట్రాఫిక్‌ లైట్లు, కార్డుబోర్డు, సెన్సార్లు, మైక్రో కంట్రోలర్‌, బొమ్మల వెహికిల్స్‌, ఎల్‌ఈడీ బల్బులు, అడాప్టర్‌, వైర్లు, పేపర్లు.

అయిన ఖర్చు: రూ.4 వేల వరకు

ఉద్దేశం : అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ సమస్యలను నియంత్రించి, అంబులెన్స్‌ను వేగంగా గమ్యానికి చేర్చడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే అంబులెన్స్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే సిగ్నల్‌ ఆకుపచ్చగా మారుతుంది. దాంతో అంబులెన్స్‌ వచ్చే దారిలో ట్రాఫిక్‌ లేకుండా ఉంటుంది.

ఇదీ చదవండి: భారత్‌లో బుజ్జి బొజ్జాయిలు ఎక్కువవుతున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.