వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దాదాపు అరగంటసేపు ఈదురుగాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం కురిసింది. చెట్ల కొమ్మలు స్తంభాలపై పడటం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మామిడి, వరిపంటలకు నష్టం వాటిల్లింది. జఫర్ ఘడ్ మండలంలోనూ భారీగా వర్షం కురిసింది. ఇటు వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేటలోనూ కొంతసేపు వడగళ్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లా...గూడూరు, కేసముద్రంలో కూడా పలు చోట్ల వర్షం కురిసింది. వర్షం ధాటికి నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు