కార్తీక మాసం చివరి శనివారం కావటం వల్ల దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. జనగామ జిల్లా... చిల్పూర్లోని బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: 'రైల్వేను ప్రైవేటీకరించం.. కార్పొరేటీకరిస్తాం అంతే!'