ETV Bharat / state

ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ సేవా సమితి సభ్యుల దాతృత్వం - జనగామలోని నిరుపేదలకు దాతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు

జనగామ జిల్లా నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ సేవా సమితి సభ్యులు డీసీపీ శ్రీనివాస్​రెడ్డి సమక్షంలో 210 మంది నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

groceries distributed to the poor by the professor jayashankar seva samithi in janagama
ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ సేవా సమితి సభ్యుల దాతృత్వం
author img

By

Published : Apr 17, 2020, 8:53 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవా సమితి ఛైర్మన్ కొత్తపల్లి సతీశ్​ కుమార్ ఆధ్వర్యంలో 210 మంది మున్సిపాలిటీ కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యాన్ని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ మధుమోహన్ పంపిణీ చేశారు. అదేవిధంగా నర్మెట్ట పీఏసీఎస్​​ మాజీ వైస్ ఛైర్మన్ పెద్ది రాజిరెడ్డి జనగామ పోలీసులకు రూ. 50వేలు విలువ చేసే పండ్లు, డ్రై ఫ్రూట్స్​ను ఏసీపీ వినోద్ కుమార్ కు అందజేశారు.

కరోనా ఆపత్కాలంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవా సమితి సభ్యులను డీసీపీ అభినందించారు. భౌతిక దూరం పాటించి కరోనా వ్యాప్తిని ఎదుర్కోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.