జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని శ్రీనివాస వైన్స్లో వరంగల్ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ మద్యాన్ని సీజ్ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో దాడులు చేశామని సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నామని.. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఇలా కల్తీ చేసిన లిక్కర్ని పర్మిట్ రూంలో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి : పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్