ETV Bharat / state

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : సీఎం కేసీఆర్​ - undefined

kcr
kcr
author img

By

Published : Oct 31, 2020, 1:46 PM IST

Updated : Oct 31, 2020, 5:20 PM IST

14:33 October 31

  • సోషల్‌ మీడియా కాదు... యాంటీ సోషల్‌ మీడియా పనిచేస్తోంది: సీఎం
  • నిజాయితీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చేయలేరు
  • దుబ్బాక ఎన్నికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • దేశాన్ని పాలించే భాజపా పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది
  • రాష్ట్రంలో 38,64,751 మందికి పింఛన్లు ఇస్తున్నాం: సీఎం
  • ఒక్కో వ్యక్తికి రూ.2,016 అందిస్తున్నాం: సీఎం కేసీఆర్
  • కేంద్రం తరఫున 6,95,000 మందికి మాత్రమే పింఛన్లు అందిస్తున్నారు
  • పింఛను లబ్దిదారుల్లో కేవలం 6,95,000 మందికి మాత్రమే కేంద్రం రూ.200చొప్పున ఇస్తుంది
  • పింఛన్ల విషయంలో నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే ఒకటే నిమిషంలో రాజీనామా చేస్తా
  • పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.105 కోట్లు ఇస్తోంది
  • కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాం: సీఎం
  • రైతులను కాపాడుకోవడానికి పిడికిలి బిగించాలి... యుద్ధానికి కదలాలి
  • మక్కలు సాగుచేస్తే మద్దతు ధర రాకుండా రైతులు మునిగిపోతారు
  • నష్టపోయినా సరే ఈసారి మక్కలు కొనుగోలు చేస్తాం
  • యాసంగిలో మక్కలు వేసి మోసపోవద్దు: సీఎం
  • యాసంగిలో మక్కలు వేస్తే కొనుగోలు చేయం: సీఎం
  • రైతు వేదికలు అద్భుతమైన రైతు నిలయాలుగా మారుతాయి
     
14:18 October 31

  • రైతు అలిగితే దేశానికి తిండిపెట్టే పరిస్థితి ప్రపంచంలో ఎవరికీ ఉండదని ప్రధానికి చెప్పా
  • రైతులను, వ్యవసాయాన్ని ఆదుకోవాలని అనేకసార్లు ప్రధానికి సూచించా
  • భారతదేశానికి ప్రమాదం వస్తే ఆదుకునే శక్తి రైతులకే ఉందని ప్రధానితో అన్నాను
  • కొవిడ్ కారణంగా రాష్ట్రం రూ.50 వేల కోట్లు నష్టపోయింది
  • ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ నుంచి గొర్రెలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది
  • ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇచ్చి తీరుతాం
  • పల్లె ప్రకృతి వనం చూసి చాలా సంతోషపడ్డాను: సీఎం
  • మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్యలు తీర్చాం: సీఎం
  • ప్రతి ఊరులో నర్సరీ ఏర్పాటు చేశాం: సీఎం
  • పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయి
  • గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాం
  • ప్రతి ఊరికి ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ అందించాం
  • పంచాయతీల్లో పటిష్టమైన పరిశుభ్రత చర్యల వల్లే ఈ ఏడాది డెంగ్యూ వ్యాధి 10 శాతం కూడా సోకలేదు
  • 3 వేల తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం
  • ఇప్పుడు తండాలను బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు
  • తెదేపా అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ ధర్నా.. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే తెదేపా ధర్నా
  • ధర్నా చేసిన వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు తీర్చరు
  • సన్నరకాలు సాగుచేయమని సూచించా.. తప్పకుండా మద్దతు ధర వచ్చేలా చూస్తా
  • భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు అధిగమించి రైతులను ఆదుకుంటాం

14:00 October 31

రైతుల భూములకు సంపూర్ణ రక్షణ: సీఎం కేసీఆర్

  • కౌలు రైతుల గురించి పట్టించుకోము: సీఎం కేసీఆర్
  • పహాణిలో అనుభవదారు కాలమ్‌లో కౌలు రైతు పేరు మూడేళ్లు ఉంటే అసలు రైతుకు ఇబ్బందులు
  • పట్టాదారు హక్కులు కాపాడేందుకే కౌలు రైతులను పట్టించుకోవట్లేదు
  • పహాణిలో కేవలం మూడు కాలమ్స్‌ మాత్రమే ఉంటాయి: సీఎం
  • రాష్ట్ర ప్రభుత్వం పిడికిలెత్తి భూసర్వే చేయిస్తుంది: సీఎం కేసీఆర్
  • అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మార్పులకు వీలు లేకుండా హద్దులు నిర్ణయించి ఇస్తాం
  • నా మాటలు ఆశామాషిగా తీసుకోవద్దు: సీఎం కేసీఆర్
  • రైతులను ఒక్కటిగా చేసేందుకే ధరణి పోర్టల్‌, రైతుబంధు, రైతు బీమా
  • రైతులు ఐక్యంగా లేకుండా అడ్డుకుంటారు
  • పండించిన రైతులు, కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రయోజనం చేసేవే రైతు వేదికలు
  • తెలంగాణ వస్తదంటే ఎవరు నమ్మలేదు: సీఎం
  • సంకల్పంతో తెలంగాణ సాధించాం: సీఎం కేసీఆర్
  • కాళేశ్వరం నీళ్లు అందాయి.. కోతలు లేని విద్యుత్‌ అందిస్తున్నాం

13:41 October 31

  • రైతుల ధాన్యాన్ని వాళ్ల ఇళ్ల వద్దనే కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • మొత్తం భారతదేశంలో ఇలా కొంటున్న రాష్ట్రం ఒక్క తెలంగాణానే
  • రైతులు ఒక్క గింజ కూడా బయట అమ్మాల్సిన అవసరం లేదు
  • నేనూ రైతునే... రైతుల కష్టనష్టాలు నాకు బాగా తెలుసు
  • రైతులను ఐక్యం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం
  • రూ.వందల కోట్లు వెచ్చించి రైతు వేదికలు నిర్మిస్తున్నాం
  • రైతు వేదికలు నా గొప్ప కల
  • గొప్ప ఉద్దేశంతో, పటిష్ట వ్యూహంతో ఈ రైతు వేదికలు నిర్మించాం
  • రైతు వేదిక అద్భుతమైన శక్తి
  • రైతులు సంఘటితంగా లేము... మేము సంఘటితం అవుతున్నామని రైతులు చాటాలి
  • రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు
  • ఏ పంట వేయాలి, ఎంత ధర రావాలి అనే అంశాలను రైతు వేదికలు నిర్ణయించాలి

13:40 October 31

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : సీఎం కేసీఆర్​

  • జనగామ: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • కొడకండ్లలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
  • కొడకండ్ల మార్కెట్ యార్డులో రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి
  • రైతు వేదికల సంకల్పాన్ని వివరిస్తున్న సీఎం కేసీఆర్
  • రైతు వేదికల నిర్మాణ ఉద్దేశం, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తున్న సీఎం
  • మేడ్చల్ జిల్లాలో మొన్న కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్
  • ఇవాళ కొడకండ్లలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్
  • దేశంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవు: సీఎం కేసీఆర్
  • అన్ని దేశాల్లోనూ రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు: సీఎం
  • రైతులు కూర్చుని మాట్లాడుకునేందుకు జాగా కూడా లేదు: సీఎం
  • రైతులు తమ బాగోగులు గురించి చర్చించుకునే అవకాశమే లేదు: సీఎం
  • ఇతర దేశాల్లో రైతులకు రాయితీలు ఇస్తుంటారు: సీఎం
  • మన దేశంలో రాష్ట్రాలు సబ్సిడీలు ఇస్తామంటే కేంద్రం ఒప్పుకోవట్లేదు: సీఎం
  • రైతులకు ఎక్కువ ధర ఇస్తే మీ వడ్లు తీసుకోబోమని ఎఫ్‌సీఐ చెబుతోంది: సీఎం
  • రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి: సీఎం
  • మనది దేశంలోనే కొత్త రాష్ట్రం: సీఎం కేసీఆర్
  • ఉమ్మడి రాష్ట్రంలో ఇదే జనగామ జిల్లాలో రైతుల దుస్థితి చూసి నేను ఏడ్చాను
  • సీఎం అయ్యాక తెలంగాణ రైతును దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రతిజ్ఞ తీసుకున్నా

Last Updated : Oct 31, 2020, 5:20 PM IST

For All Latest Updates

TAGGED:

cm KCR
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.