దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయుధపూజ నిర్వహించారు. స్టేషన్లోని ఆయుధాలతోపాటు పోలీస్ వాహనాలకు అర్చకుల మంత్రోచ్చారణలతో పూజలు చేయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలతో పాటు, పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని సీఐ మల్లేష్ ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: 400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!