ETV Bharat / state

కర్షకులకు సాగు న్యాయ సలహా కేంద్రం.. దేశంలోనే తొలిసారిగా.. - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్

Agri Legal Aid Clinic Started in Jangaon District: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అలుపెరుగకుండా శ్రమించి ఆహారాన్ని అందించారు రైతన్నలు. అటువంటి అన్నదాతలు ఏవైనా సమస్యలొస్తే కోర్టుల చుట్టూ తిరిగే సమయం, శక్తి లేక ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే తొలిసారిగా కర్షకులకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జనగామ జిల్లా బమ్మెరలో సాగు న్యాయ సలహా కేంద్రం ప్రారంభమైంది.

Agri Legal Aid Clinic
Agri Legal Aid Clinic
author img

By

Published : Mar 19, 2023, 9:00 AM IST

Agri Legal Aid Clinic Started in Jangaon District: ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు శ్రమే మిగులుతోంది తప్ప కష్టపడిన దానికి ఫలితం దక్కట్లేదు. భూ సమస్యలు, గట్టు పంచాయితీలు, నీటి వివాదాలు, నకిలీ విత్తన, పురుగు మందులు.. ఇలా నిత్యం ఎన్నో సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. మార్కెట్​లో దళారులు, భూ కబ్జాదారుల చేతిలో మరెంతో మంది మోసపోతున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎన్నో చట్టాలున్నా.. వాటిపై రైతులకు అవగాహన ఉండట్లేదు.

మాకు ధరణితో ప్రాబ్లమ్ ఉంది. రైతుబంధు పడటం లేదు అని.. ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంది అనిపించినప్పుడు.. ఆ రైతు ఎక్కడికి పోవాలి. ప్రతి దానికి రెవెన్యూ ఆఫీస్​లు ఉంటాయి. కానీ రెవెన్యూ ఆఫీస్​కు పోతే ఎలా పని చేయించుకురావాలి. ఎవరిని కలవాలి. అప్లికేషన్ ఎవరికి పెట్టుకుంటే మనకి వెంటనే పని అవుతుందని చెప్పి ఒక సలహా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. -బాలభాస్కర్‌, జనగామ జిల్లా జడ్జి

రైతు చట్టాలపై కర్షకులకు అవగాహన కల్పిస్తూ, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేసేందుకు తొలిసారిగా సాగు న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేశారు. సాగు న్యాయ సలహా కేంద్రాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సమక్షంలో సుప్రీం న్యాయమూర్తి రామసుబ్రమణియన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవల విభాగం, నల్సార్‌ యూనివర్సిటీ, లీగల్‌ ఎంపవర్‌ మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మర్స్ సొసైటీ విభాగాలు ఈ సలహా కేంద్రానికి అండగా ఉంటూ, సహాయం అందిస్తాయి.

బమ్మెరలోని కేంద్రం పని తీరు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని న్యాయ సలహా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. రైతులకు న్యాయ సహాయం అందించేందుకు సాగు న్యాయ సలహా కేంద్రం ఏర్పాటును స్థానికులు హర్షించారు. ఈ కేంద్రం ద్వారా తమ సమస్యలు పరిష్కారమౌతాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దురదృష్టం ఏంటంటే భారతదేశంలో 70 శాతం జనాభా ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతున్నా కానీ.. చట్టానికి సంబంధించిన సమాచారం అందించే వాళ్లు, వ్యవసాయం చట్టాల మీద రీసెర్చ్ చేసే వాళ్లు, వ్యవసాయ సమస్యలు వచ్చినప్పుడు రైతులకు అండగా నిలబడే వ్యవస్థ లేదు. అలాంటి ఒక భారీ వ్యవస్థను రూపొందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ రోజున ఈ గ్రామంలోని క్లీనిక్​కు రావడం జరిగింది. -సునీల్, లీఫ్స్‌‌ అధ్యక్షులు

దేశంలోనే తొలిసారిగా కర్షకులకు సాగు న్యాయ సలహా కేంద్రం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.