ETV Bharat / state

జగిత్యాలలో పసుపు దగ్ధం... రూ.3 లక్షలు పంట నష్టం

author img

By

Published : Apr 17, 2020, 9:56 AM IST

పసుపు పంటను ఇంటికి తెచ్చి పెరట్లో నిల్వ చేయగా గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నాడు.

నాకు నా కుటుంబానికి ప్రభుత్వ సాయమే దిక్కు : బాధితుడు

జగిత్యాల జిల్లా ధరూర్​లో పెరట్లో నిలువ ఉంచిన పసుపు దగ్ధమైంది. ధరూర్​కు చెందిన శీలం తిరుపతి అనే రైతు పసుపును ఉడకబెట్టేందుకు పెరట్లో నిల్వ చేశాడు. గుర్తు తెలియని దుండగులు రాత్రి తగులబెట్టారు. కాలిపోయిన పసుపు విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. చేతికొచ్చిన పసుపు కాలిబూడిద అయిందని రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

కరోనా కారణంగా లాక్ డౌన్​తో ఇబ్బందుల్లో ఉన్న తనకు పంట దగ్ధం మరింత కుంగదీసిందని రైతు బోరుమన్నాడు. ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని.. ఇందుకు వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

ఇవీ చూడండి : ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 7వేల మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.