పసుపు ధరలు పెరగడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కాడి రకం పసుపు క్వింటాకు రూ.7,666, గోళ రకానికి 6,751, చూర రకానికి 5,501 ధర పలికింది. గత కొన్నేళ్లుగా కనీస ధరలు లభించక దిగాలు పడిన పసుపు రైతులకు ఈ ఏడు బంగారంగా మారింది. వారం రోజులుగా అన్ని వ్యవసాయ మార్కెట్లలోను పసుపు పంటకు రికార్డు ధరలు లభించడం రైతులకు ఊరటనిస్తోంది.
నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్‌తో పోటీ పడుతూ ధరలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అందరి చూపు మెట్పల్లి మార్కెట్‌వైపు పడింది. భవిష్యత్తులో ధరలు మరింత పెరగొచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. దళారులను నమ్మి మోసపోకుండా వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చి లాభాలు ఆర్జించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: నేను ఎవర్ని.. నేనేం చేస్తాను.. విద్యార్థులతో హరీశ్ మమేకం