జగిత్యాల జిల్లాలో కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల డిపోల పరిధిలో 263 బస్సులు ఉండగా... ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల 80 శాతానికి పైగా బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న ప్రభుత్వ ప్రకటన.... రోజువారి కూలీ దొరుకుతుందనే ఆశతో నిరుద్యోగులు జగిత్యాల జిల్లాలోని అన్ని డిపోల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్లలో నిల్చొని ఉద్యోగం కోసం చూస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రం కావడం... రోజు ఎంతో కొంత వస్తుందని ఆశతో పెద్ద సంఖ్యలో యువకులు డిపోల వద్దకు తరలివస్తున్నారు. మూడు నుంచి నాలుగు రోజులుగా క్యూ లైన్లలో ఉన్నా పని దొరకడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: లైవ్: జిన్పింగ్ రెండో రోజు టూర్ అప్డేట్స్