TSRTC Cargo Services In Jagtial : తెలంగాణ ఆర్టీసీ చేపట్టిన కార్గో సేవల విస్తరణతో వినియోగదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సకాలంలో పార్శిళ్లు చేరవేస్తుండటంతో జగిత్యాల జిల్లాలో ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల పరిధిలో ప్రతి ఏటా కోటికిపై ఆదాయం వస్తోందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు.
TS RTC Cargo Parcels : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పార్శల్ పంపాలంటే తక్కువ సమయంలో పార్శిల్ చేరటంతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఆర్టీసీ కార్గోద్వారనే పంపుతున్నారు. జగిత్యాల జిల్లాలో పరిశీలిస్తే జగిత్యాల డిపో పరిధిలో ప్రతి రోజు 200 నుంచి 250 వరకు పార్శిల్స్ పంపుతుండగా వచ్చే పార్శిళ్ల సంఖ్య 300 నుంచి 400 వరకు ఉంటుంది.
రూ.30 వేల నుంచి 35 వేల వరకు ప్రతి రోజు ఆదాయం వస్తోంది. మెట్‌పల్లి, కోరుట్ల డిపోలో పరిధిలోనూ ప్రతి రోజు రెండు డిపోలు కలిపి 200కు పైగా పార్శిళ్లు వస్తుండగా రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది.మొత్తానికి ప్రతి ఏటా కోటికిపైగా ఆదాయం పెరిగింది. ఈ వస్తున్న ఆదాయం అదనంగా వస్తుండటంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్గో ఆదాయం అదనంగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో పండగ కాలంలో పిండి వంటలు, రోజు వారిగా పంపే మెడికల్ ఏజెన్సీల మందులు, ఇతర సరుకులు కార్గో ద్వారానే పంపుతున్నారు.
Tsrtc Cargo: కార్గో ద్వారా వచ్చిన ఆదాయం ఎంతంటే?
" ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పార్శిళ్లు 12 గంటల్లోపు చేరతాయి. ప్రజలు కార్గో సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. రోజు రోజుకు వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటంతో జగిత్యాల బస్టాండ్లో కార్గో సేవలకు రోజుకు 30వేల ఆదాయం వస్తోంది." -సునీత, జగిత్యాల డిపో మేనేజరు
ఆర్టీసీ కార్గోలో జామకాయలు మాయం.. ఏజెన్సీ రద్దు చేసిన అధికారులు
"ప్రతి రోజులు ఆర్టీసీ పార్శిళ్లను దగ్గర ఉండి పంపుతున్నాము. గతంలో ఒక పార్శిల్కి రూ.10 ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 5నుంచి రూ.7 వస్తున్నాయి. దీంతో మాకు రోజుకు రూ.1000 వచ్చే ఆదాయం ఇప్పుడు రూ.300 వస్తోంది. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. కూలీ ధరలు పెంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి." - ఆర్టీసీ కూలీలు
రోజు రోజు వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరింత సేవలు పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు కూలీ ధరలు తగ్గించారని తమకు ధరలు పెంచాలని కూలీలు కోరుతున్నారు. ప్రతి రోజు ఆర్టీసీ పార్శిళ్లను దగ్గర ఉండి పంపుతున్నామని మాకు ధరలు పెంచి తమని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కూలీలు వేడుకుంటున్నారు.
'AM 2 PM' పేరిట ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసును ప్రారంభించిన TSRTC
tsrtc cargo services : ఆగస్టు నుంచి ప్రతి ఇంటికి కార్గో సేవలు