ETV Bharat / state

వైద్య కళాశాలలో ఉద్రిక్తత.. విద్యార్థులతో కలిసి వైస్‌ ప్రిన్సిపల్ నిరసన - జగిత్యాల వైద్యకళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఆందోళన

Tension at Jagtial Medical College: జగిత్యాల వైద్య కళాశాలలో ఓ గది విషయమై నిన్న అర్ధరాత్రి ఇద్దరు వైద్యులు, వైస్‌ ప్రిన్సిపల్‌ మధ్య గొడవ జరిగింది. తనను కులం పేరుతో దూషించారని వైద్యుల తీరుపై వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైస్ ప్రిన్సిపల్​కు మద్దతుగా వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Jagtial Medical College
Jagtial Medical College
author img

By

Published : Jan 19, 2023, 10:41 AM IST

Tension at Jagtial Medical College: జగిత్యాల వైద్య కళాశాల మొదలైన కొన్ని నెలలకే వివాదాల బాట పట్టింది. ఈ వైద్యకళాశాలలో ఓ గది విషయమై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వైద్యులు, వైస్‌ ప్రిన్సిపల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వైద్య విద్యార్థులంతా అక్కడి చేరుకోవడంతో వైస్ ప్రిన్సిపల్​తో గొవడ పడుతున్న వైద్యులు.. వారందరిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైస్ ప్రిన్సిపల్ ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనకు మద్దతుగా నిలిచి ఆందోళనకు దిగారు.

విషయం తెలిసిన పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. గది కేటాయింపు విషయమై ఓ వైద్యుడు నాలుగు నెలలుగా వేధిస్తున్నారని, ప్రస్తుతం ఆయనతో పాటు మరో వైద్యుడు వచ్చి అకారణంగా కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారని వైస్‌ ప్రిన్సిపల్‌ డేవిడ్‌ ఆనంద్‌ కుమార్‌.. పోలీసులకు వివరించారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అర్ధరాత్రి ఆందోళన వద్దని పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ఎస్సై చిరంజీవి వారికి సర్దిచెప్పారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అనంతరం జగిత్యాల పోలీస్ స్టేషన్​లో వైద్యులు డాక్టర్ శశికాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిపై వైస్‌ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ప్రిన్సిపల్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పోలీసులకు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.