కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండడం వల్ల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రజలు గుంపులుగా ఉండకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
పట్టణంలో కేవలం నిత్యావసర సరుకులు, మందుల కోసం మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అది కూడా ద్విచక్ర వాహనంపై ఒకరు వెళ్లడానికి మాత్రమే అనుమతించారు. ఇద్దరు వెళితే వారిపై చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము