జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఆయన సతీమణి సరోజన హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వివిధ పుష్పాలతో అందంగా అలంకరించిన పద్మావతి, శ్రీనివాసుల కల్యాణం చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి : కన్నయ్య బర్త్డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్!