ETV Bharat / state

అంగన్​వాడీలో పేద గర్భిణీలకు సీమంతం

పేద గర్భిణీలకు సీమంతాలు చేస్తూ... వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు అంగన్​వాడీ టీచర్లు. ఇంట్లో చేసుకున్న విధంగా సీమంత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంగన్​వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. ఇంతకీ ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుందామా?

author img

By

Published : Mar 18, 2019, 7:28 PM IST

సీమంతం చేసిన అంగన్​వాడీ టీచర్లు
సీమంతం చేసిన అంగన్​వాడీ టీచర్లు
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కాశీబాగు అంగన్​వాడీ కేంద్రంలో పేద గర్భిణీ స్త్రీలకు సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. పోషణ్ అభియాన్​ వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఏమేం చేశారు.?

పేద కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు. వారి కళ్ళల్లో ఆనందం చూసి వీరు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన వైభవంగా చేశారు. హాజరైన వారందరికీ మిఠాయిలు తినిపించి గర్భిణీలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి వేడుకలు చేసుకోవాలన్న కోరికఉన్నా... పేదరికం వల్ల చేసుకోలేకపోతున్నామని కొందరు గర్భిణులు తెలిపారు.

గర్భిణులకు అవగాహన

పోషణ్​ అభియాన్​ వారోత్సవాల్లో భాగంగా గర్భిణీలతో పాటు బాలింతగా ఉన్నప్పుడు నిత్యం తీసుకోవాల్సిన పోషక పదార్థాలపై అవగాహన కల్పించారు.

రోజూ చిన్నారులతో సందడిగా ఉండే అంగన్ వాడీ కేంద్రం.. గర్భిణుల రాకతో కళకళలాడింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.