రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడిని చికిత్స ఖర్చుల కోసం ఆదుకోవడానికి తోటి స్నేహితులు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంపాదించే వయసు కాకపోయినా విరాళాలు సేకరిస్తూ తమవంతు సాయం అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. అదే కుటుంబానికి చెందిన కొందరికి గాయాలయ్యాయి.
మల్లాపూర్ మండలానికి చెందిన చిన్నారులు సృజన్ మల్లాపూర్‌లోని ఆదర్శ పాఠశాలలో, శృతి సరస్వతి పాఠశాలలో చదువుతున్నారు. ప్రమాదంలో సృజన్ కోమాలోకి వెళ్లగా, శృతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి చికిత్స నిమిత్తం రూ. 12 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయం తెలుసుకున్న శృతి, సృజన్ స్నేహితులు తమ వంతు సహాయం అందించేందుకు విరాళాలు సేకరిస్తున్నారు.
చిన్న వయసులోనే వీరు స్నేహానికి ఇస్తున్న విలువను తెలుసుకొని సహాయం చేయడానికి పలువురు ముందుకొస్తున్నారు.
ఇదీ చదవండి: ఐశ్వర్య ఆత్మహత్యకు ముందు కేటీఆర్‌కు ట్వీట్.. సోనూసూద్‌కు మెయిల్..!