జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. కార్మికులను మాత్రం మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 11వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరోనా సమయంలోనూ అలుపెరుగక విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: Nama Nageswara Rao: మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..