ETV Bharat / state

కరోనాతో వ్యక్తి మృతి... భయాందోళనలో ప్రజలు..

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని చైతన్య నగర్​లో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

author img

By

Published : Jul 28, 2020, 4:40 PM IST

man died with corona in metpally
కరోనాతో వ్యక్తి మృతి... భయాందోళనలో ప్రజలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కరోనా వైరస్ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇటీవలే కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా... అటు ప్రజలు ఇటు అధికారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పట్టణంలో రెండు కేసులు నమోదు కాగా... తాజాగా చైతన్య నగర్​లో నమోదైన మరో కేసులో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

ముందు జాగ్రత్త చర్యగా మెట్​పల్లి పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పట్టణంలోని చైతన్య నగర్​లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు. ప్రజలు ఎవరికి భయపడవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని జగదీశ్వర్ గౌడ్ సూచించారు.

ఇవీ చూడండి: కరోనా కేసులపై హైకోర్టు విచారణ ఆగస్టు 13కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.