రెవెన్యూ చట్టంతో ఏం సాధించారని తెరాస సంబురాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ఇప్పటికే భూమి పోర్టల్ అమలవుతోందని... దేశంలోనే ఆదర్శంగా కర్ణాటకలో భూ కావేరి కొనసాగుతోందన్నారు.
త్వరలోనే భూముల విలువలు పెంచబోతున్నారని జీవన్‌రెడ్డి జోష్యం చెప్పారు. మరో రెండు నెలలు ఆగితే సీఎం కేసీఆర్ నిజ స్వరూపం తెలుస్తుందన్నారు. ముందుగా సన్నరకాలకు క్వింటాల్‌కు రూ.2,500 ప్రకటించి సంబురాలు చేసుకోవాలని హితవు పలికారు.
సన్నరకాలను సాగు చేయాలని సీఎం సూచించారు కాబట్టి... కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మక్కలకు మద్దతు ధర రూ.1,850 ఉంటే మార్కెట్లో రూ.1,300 మాత్రమే ఉందని.. క్వింటాల్‌కు రూ.550లు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి : రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తి ప్రక్షాళన దిశగా సర్కార్