ETV Bharat / state

పాఠశాలల్లో సిబ్బంది లేకుండా.. పథకాలు తెస్తే ఏం లాభం?: జీవన్​ రెడ్డి

MLC Jeevan Reddy on Telangana Budget: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన తెరాస సర్కారు.. అధికారంలోకి వచ్చాక విద్యారంగాభివృద్ధిని మర్చిందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి విమర్శించారు. పాఠశాలల్లో సిబ్బంది లేకుండా ఎన్ని పథకాలు తెచ్చినా ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్​ చేశారు.

mlc jeevan reddy
ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి
author img

By

Published : Feb 28, 2022, 2:09 PM IST

MLC Jeevan Reddy on Telangana Budget: రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించేలా రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ అధికారంలోకి వచ్చిన తెరాస సర్కార్‌... ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో తన చిత్తశుద్ధిని చాటుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు 'మన ఊరు-మన బడి' కార్యక్రమం తెచ్చారని.. సిబ్బంది నియామకం చేపట్టకుండా ఎన్ని పథకాలు తెచ్చినా ఉపయోగం ఉండదని జీవన్​ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ విషయం మరిచింది

"కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని తెరాస చెప్పింది. అధికారంలోకి వచ్చాక విద్యారంగాభివృద్ధిని మరిచింది. ఈ ఎనిమిదేళ్లలో పాఠశాలల్లో నియామకం ఎన్ని సార్లు చేపట్టారు.? సిబ్బంది లేకుండా ఎన్ని పథకాలు తెచ్చినా ఉపయోగం ఉండదు. రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి." -జీవన్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ

ఖాళీలను భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఈ 8 ఏళ్లలో విద్యావ్యవస్థ విఫలమైందని.. ప్రభుత్వ విద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్‌ విద్యను ప్రొత్సహించిందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులతోపాటు.. రాష్ర్టంలో మిగిలిపోయిన 25 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేసినప్పడే విద్యావ్యవస్థ మెరుగు పడుతుందని జీవన్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బందితో పాటు.. మే చివరి నాటికి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి: జీవన్‌రెడ్డి

ఇదీ చదవండి: 'తినేందుకు తిండిలేక పిల్లలు అలమటిస్తున్నారు'.. భావోద్వేగంలో విద్యార్థుల తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.