MLC Jeevan Reddy Comments: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియతో స్థానిక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పునరాలోచించి.. ఉద్యోగులకు సౌకర్యవంతంగా బదిలీ ప్రక్రియ చేపట్టాలని జగిత్యాలలో కోరారు. ప్రస్తుతం చేపట్టిన బదిలీ ప్రక్రియలో జూనియర్లు దూర ప్రాంతాలకు బదిలీ కావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ స్థానికత కోసం తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు అదే లేకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తుందని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొందన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని పునరాలోచించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు అన్యాయం..
"ఆర్టికల్ 371డీతో స్థానిక ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. బదిలీ ప్రక్రియలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికత కంటే సీనియార్టీకే ప్రాధాన్యం ఇవ్వటం సరికాదు. స్థానికతే లక్ష్యంగా సాధించున్న రాష్ట్రంలో స్థానికత లేకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం బదిలీల ప్రక్రియపై మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి" - జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి: