ప్రతీ పల్లె ఆదర్శ గ్రామంగా నిలవాలని మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. జగిత్యాల బండారి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతితో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయన్నారు. గ్రామాల్లో మిషన్ భగిరథ పథకంతో తాగునీటి సమస్య తీరిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సిబ్బందికి మంత్రులు దిశానిర్దేశం చేశారు.